News December 1, 2025
అంకన్నగూడెం గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..!

ములుగు మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీ అంకన్నగూడెం పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఈ గ్రామానికి రిజర్వేషన్ ఎస్టీ జనరల్ కేటాయించగా.. సర్పంచ్‌గా కొట్టెం రాజు, ఉప సర్పంచ్‌గా అల్లెం నాగయ్యను ఎన్నుకుంటూ గ్రామస్థులు తీర్మానించారు. ఆరుగురు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. <<18420628>>1972లో పంచాయతీ ఆవిర్భావం నుంచి ఏకగ్రీవం <<>>చేసుకుంటున్న గ్రామస్థులు అదే ఆనవాయితీని కొనసాగించారు. మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలిచారు.
Similar News
News February 19, 2026
ఆ షుగర్ టెస్టుపైనే ఆధారపడొద్దు: లాన్సెట్

షుగర్ లెవల్స్ చెక్ చేసేందుకు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న HbA1c టెస్టునే ప్రామాణికంగా తీసుకోవద్దని లాన్సెట్ జర్నల్ సూచించింది. ఈ టెస్టులో ఎర్రరక్త కణాల్లో (RBC) కలిసే చక్కెర స్థాయి లెక్కిస్తారు. అయితే ‘రక్తహీనత, ఇతర బ్లడ్ సమస్యలు సాధారణమైన భారత ప్రజల్లో RBCలు విచ్ఛిన్నం అవుతాయి. దీంతో ఎక్కువ కణాలు ఉన్నట్లు కన్పించి ఫలితం తప్పుగా వస్తోంది. ఫలితంగా డయాబెటిస్ ఉన్నా, తెలియడం లేదు’ అని పేర్కొంది.
News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.