News March 16, 2025
అంగన్వాడీలకు ఒక్క పూట బడి ఉత్తర్వులు జారీ

వేసవి తీవ్రత కారణంగా అంగన్వాడి కేంద్రాలకు సంబంధించిన ఒంటి పూట బడి నిర్వహణకు సర్కార్ శనివారం సర్కులర్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నుంచి అంగన్వాడిలకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కేంద్రాలు నిర్వహించాలని ఉత్తరవుల్లో పేర్కొన్నారు. సీడీపీవోలు ఉత్తర్వులను అంగన్వాడి కేంద్రాలకు సర్కులేట్ చేయాలని ఆదేశించారు. వేసవిలో పిల్లలకు అనారోగ్యాలు కలగకుండా బాధ్యతగా చూసుకోవాలని సూచించారు.
Similar News
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘మహాదేవ’’

ముక్కోటి దేవతలలో శివుడి స్థానం అత్యున్నతమైనది. సృష్టి, స్థితి, లయ కారకులలో ఆయన లయకారుడైనప్పటికీ, జ్ఞానానికి ఆయనే మూలం. దేవతలకు, అసురులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు, సృష్టికి ప్రమాదం వాటిల్లినప్పుడు దేవతలందరూ శివుడినే శరణు కోరుతారు. బ్రహ్మ, విష్ణువుల వంటి వారికే ఆదిగురువుగా నిలిచిన దేవుడు శివుడు. దేవతలకు సైతం దేవుడు కాబట్టి ఆయనను ‘మహాదేవుడు’ అని పిలుస్తారు. అంటే దేవుళ్లందరిలో గొప్పవాడు అని అర్థం.
News February 12, 2026
చామగడ్డ విత్తన దుంపలను ఎలా నిల్వ చేయాలి?

పక్వానికి వచ్చిన చామగడ్డ పంటను తవ్వి కాస్త ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. విత్తన దుంపలను తవ్విన తర్వాత వాటికి కనీసం నెల రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఆ సమయంలో అవి కుళ్లిపోకుండా తవ్విన 4-5 రోజుల తరువాత, దుంపలపై 10 లీటర్ల నీటిలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములను కలిపి దుంపలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసి నీడలో ఆరబెట్టాలి. తర్వాత దుంపలను గాలి, వెలుతురు ఉండే పొడి ప్రదేశంలో నిల్వ చేయాలంటున్నారు నిపుణులు.
News February 12, 2026
అమరావతిని వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక

అమరావతిని ప్రాంతీయ సమీకృత వృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగంలో విజయవాడ–గుంటూరు–అమరావతి ప్రాంతాన్ని లాజిస్టిక్స్, పరిపాలన, నైపుణ్యాల హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతతో రాజధానిని అనుసంధానించి టైర్-2 పట్టణ సముదాయంగా రూపుదిద్దుతామని పేర్కొన్నారు. పునర్నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు.


