News November 8, 2024

అంగన్వాడీ అభ్యర్థుల ఎంపిక పూర్తి: ఐసీడీఎస్ పీడీ

image

అనంతపురం జిల్లాలో ఇటీవల నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు, ఆయాల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఐసీడీఎస్ పీడీ డాక్టర్ శ్రీదేవి గురువారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మెయిన్, మినీ అంగన్వాడీ వర్కర్ సహా ఆయా ఖాళీలు మొత్తం 84 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించగా.. 61 మందిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. వారిలో మెయిన్ అంగన్వాడీ పోస్టులు 9 కాగా, ఐదు పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు.

Similar News

News December 6, 2024

తాడిపత్రిలో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

తాడిపత్రి రైల్వే స్టేషన్ పరిధిలోని కోమలి-జూటూరు మధ్య షేక్ బాషా రైలు కిందపడి గురువారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంతకల్లుకు చెందిన షేక్ బాషా పుదిచ్చేరి నుంచి కాచిగూడకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తాడిపత్రి రైల్వే ఎస్ఐ నాగప్ప చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News December 6, 2024

సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి: కలెక్టర్ చేతన్

image

గ్రామ సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ నమోదును తప్పనిసరిగా చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల్లో వెనుకబడిన ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.

News December 6, 2024

శ్రీ సత్యసాయి: ‘నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోండి’

image

నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌ను ఆదేశించారు. గురువారం పౌర సరఫరాల శాఖ అంశంపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సూచించారు. అధికారులు, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ వల్ల రైతుల ఇబ్బంది పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.