News November 19, 2025
అంగరంగ వైభవంగా ప్రారంభమైన అనంతుని దీపోత్సవం

పద్మనాభంలోని అనంత పద్మనాభుని దీపోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యింది. తొలి పావంచ వద్ద దీపాలను వెలిగించి విశేష అర్చనలు చేశారు. పోలీసులకు ఉత్సవం జరిగే అన్ని ప్రదేశాలలో డ్యూటీలు వేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, సిసి కెమెరాలను, డ్రోన్ కెమెరాను ఆ కేంద్రానికి అనుసంధానం చేశారు. రాత్రికి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 23, 2026
ఆత్మకూరు: శిలాఫలకంపై సీఎం పేరు గల్లంతు.. మంత్రి ఆగ్రహం

పరమేశ్వర స్వామి చెరువు కట్ట అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. శిలాఫలకంపై మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు లేకపోవడంపై మంత్రి వాకిటి శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ దీనిపై వివరణ కోరారు.
News January 23, 2026
మంచిర్యాల: ఇరువర్గాలను రెచ్చగొట్టిన వ్యక్తికి రిమాండ్

ఇరువర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తిని పోలీసులు కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు. భీమారం మండలం బూరుగుపల్లికి చెందిన రాజు కుమార్ నాయక్ గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలపై అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నాడని ఎస్ఐ రాజేందర్ అన్నారు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News January 23, 2026
నంద్యాల కలెక్టరేట్‌లో జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

భారత ఎన్నికల సంఘం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో వివిధ శాఖల సిబ్బందితో ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఎన్నికలోనూ కులమతాలకు, ప్రలోభాలకు తీతగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగిస్తామని ఈ సందర్భంగా సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.


