News February 6, 2025
అందరికి మాత్రలు అందజేయాలి: ASF కలెక్టర్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, విద్యాసంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించాలన్నారు.
Similar News
News February 12, 2026
గెలుపు కోసం గట్టి ప్లాన్లు!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో ఎన్నికలు రానున్నాయన్న సమాచారంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2021లో కోవిడ్ గందరగోళం, టీడీపీ నామమాత్రంగా పోటీలో ఉండటంతో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలను వైసీపీ దక్కించుకుంది. ఈసారీ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా YCP పట్టుదలగా ఉండగా, కూటమి పార్టీలు సైతం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి.
News February 12, 2026
మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


