News February 7, 2025

అందాల పోటీల్లో చంద్రగిరి అమ్మాయికి కిరీటం.. CM ప్రశంస

image

మలేషియాలో జరిగిన మిస్ గ్లోబల్ ఆసియా-2025 విజేతగా చంద్రగిరికి చెందిన భావన రెడ్డి నిలిచారు. 18 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి మిస్ గ్లోబల్ ఆసియా-2025 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు ఆమె గురువారం CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. అంతర్జాతీయ వేదికపై తిరుపతి పేరును గట్టిగా వినిపించిన ఆమెను CM అభినందించారు. 

Similar News

News March 14, 2026

జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.

News March 14, 2026

మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

image

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.

News March 14, 2026

BHPL: సింగరేణి ముస్లిం ఉద్యోగులకు GOOD NEWS

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12,500 అడ్వాన్స్ కింద ఈ నెల 18న బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ అడ్వాన్స్‌ను ఏప్రిల్ నెల వేతనాల నుంచి ప్రారంభించి 10 సమాన నెలవారీ వాయిదాల్లో తిరిగి రికవరీ చేసుకోనుంది.