News November 19, 2025

అందుకే ఫైరింగ్ జరగలేదు!

image

AP: విజయవాడ, ఏలూరులో <<18319919>>మావోయిస్టులను<<>> పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మావోలు, పోలీసులు ఎదురుపడితే పరస్పర కాల్పులు జరుగుతుంటాయి. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నిన్న అలా జరగలేదు. కొందరు సానుభూతిపరులను పంపి భవనాన్ని చుట్టుముట్టామని తెలియజేశారు. లొంగిపోవాలని సందేశం పంపారు. మావోలు దాచిన ఆయుధాలు బయటికి తీయకుండా దిగ్బంధించారని, దీంతో ప్రతిఘటించలేకపోయారని సమాచారం.

Similar News

News January 23, 2026

బందీలుగా ఉన్న మత్స్యకారులకు ఈనెల 29న విముక్తి

image

AP: బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులు ఈ నెల 29న విడుదల కానున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ప్రకటించింది. విడుదలయ్యే వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. గత అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించడంతో వీరు అరెస్టయ్యారు.

News January 23, 2026

బ్రెజిల్‌తో భాగస్వామ్యం కొత్త శిఖరాలకు: మోదీ

image

బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో PM మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ‘కొత్త శిఖరాలను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్న IND-బ్రెజిల్ భాగస్వామ్యంపై సమీక్షించాం. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సహకారం చాలా ముఖ్యం’ అని ట్వీట్ చేశారు. ‘FEB 19-21 మధ్య నా ఢిల్లీ పర్యటనపై డిస్కస్ చేశాం. భౌగోళిక పరిస్థితులు, గాజాలో శాంతి స్థాపన, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించాం’ అని లూలా పేర్కొన్నారు.

News January 23, 2026

జనవరి 23: చరిత్రలో ఈరోజు

image

1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం (ఫొటోలో)