News October 8, 2025

అందుబాటులో TTD-2026 డైరీలు, క్యాలెండర్లు

image

భక్తుల సౌకర్యార్థం TTD-2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తోంది. 12, 6 పేజీల క్యాలెండర్లు, టేబుల్ టాప్ క్యాలెండర్లు, డీలక్స్, చిన్న డైరీలు, శ్రీవారి–అమ్మవారి చిత్రాలతో కూడిన క్యాలెండర్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్ సేవల ద్వారా ఇంటి వద్దకే డెలివరీ సౌకర్యం ఉంది. www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్లలో కూడా లభ్యం.

Similar News

News January 17, 2026

వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

image

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

News January 17, 2026

అందరినీ అలరించడం చిరంజీవికే సాధ్యం: వీవీ వినాయక్

image

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం తన స్వగ్రామమైన చాగల్లులో పర్యటించారు. సంక్రాంతి సెలవుల్లో స్నేహితులతో కలిసి సొంత థియేటర్‌లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని వీక్షించారు. అన్ని వర్గాలను ఆకట్టుకోవడమే మెగాస్టార్ ఆకాంక్ష అని ఆయన కొనియాడారు. చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని ఆకాంక్షించారు. పండుగ పూట వినాయక్ రాకతో గ్రామంలో సందడి నెలకొంది.

News January 17, 2026

ఆ ప్లేయర్‌ను చివరి వన్డేలోనైనా ఆడించండి: అశ్విన్

image

న్యూజిలాండ్‌తో రెండు వన్డేలకు బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీ క్రికెటర్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడో వన్డేలోనైనా అతడిని ఆడించాలని సూచించారు. అర్ష్‌దీప్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని, జట్టు విజయాల్లో భాగమయ్యాడని తెలిపారు. అయినా టీమ్‌లో స్థానం కోసం పోరాడుతున్నాడని చెప్పారు. బ్యాటర్ల విషయంలో ఇలా జరగదని, ప్రతిసారీ బౌలర్లే బలవుతున్నారని పేర్కొన్నారు.