News September 13, 2025
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం జిల్లాల వారీగా ఎస్పీలను బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన కృష్ణారావును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనా సోమవారం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది.
Similar News
News December 9, 2025
శ్రీకాకుళం: రేపటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవిబాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వీటి కోసం జిల్లాలో నాలుగు కేంద్రాలను ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఎచ్చెర్లలో శివాని, వెంకటేశ్వర కళాశాలలు, నరసన్నపేటలో కోర్ టెక్నాలజీ, టెక్కలి ఐతమ్‌లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News December 9, 2025
వాయువేగంతో ‘గ్రేటెస్ట్ హైదరాబాద్’.. స్పష్టత ఏది?

GHMCలో మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ల <<18508761>>విలీనం<<>> వాయువేగంతో పూర్తైంది. 150 డివిజన్లతో ఉన్న GHMC.. 27 ULBs కలిశాక 12 జోన్లు, 300డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో (నం.266) విడుదల చేసింది. పెరుగుతున్న నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వార్డులు డబుల్ చేయాలని కమిషనర్ పంపిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే..మమ్మల్ని GHMCలో ఎందుకు కలిపారో చెప్పడంలేదెందుకని శివారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News December 9, 2025
వన్డే క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా వాసి

ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు BCCI ఆధ్వర్యంలో ముంబైలో జరగనునున్న అండర్-19 ఉమెన్స్ వన్డే టోర్నీకి కర్నూలు జిల్లా వెల్దుర్తి(M) ఎల్.బండకు చెందిన కౌసల్య బాయి ఎంపికైంది. కర్నూలు క్రికెట్ ఆసోషియేషన్ శిక్షకుడు శ్రీనివాసులు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యారు. కౌసల్య ప్రస్తుతం కర్నూలులో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.


