News September 13, 2025

అంబేడ్కర్ కోనసీమ: నేడు పాఠశాలలకు సెలవు

image

నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సలీంబాషా తెలిపారు. గతంలో వరదల కారణంగా సెలవులు ఇచ్చినందున, వాటి స్థానంలో రెండో శనివారం పనిచేయాలని ఆదేశాలు జారీ చేశామని, అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శనివారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ఉంటుందని స్పష్టం చేశారు.

Similar News

News December 9, 2025

మెదక్: గ్రామాల్లో.. వాట్సప్ ప్రచారాలు

image

పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఆధునిక పరిజ్ఞానాన్ని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్, వార్డు అభ్యర్థులు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో.. ప్రచారాలను విస్తృతం చేశారు. తమ అనుచరులతో ప్రచార వీడియోలు సైతం తీయించి.. వాటికి సాంగ్స్ క్రియేట్ చేసి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచారం చేస్తున్నారు.

News December 9, 2025

అమరావతిలో రూపుదిద్దుకుంటున్న AIS సెక్రటరీల బంగ్లాలు

image

అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పటికే అమరావతి ప్రాంతంలోని
రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న AIS సెక్రటరీల బంగ్లాలు రూపుదిద్దుకోవడం. మొత్తం 90 బంగ్లాలు వస్తున్నాయి. వీటిలో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వైపు రాత్రింబవళ్లు ఐకానిక్ టవర్ల వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

News December 9, 2025

జనగామ: చెక్ పోస్టుల వద్ద నాఖాబందీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద నకాబంది, వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, న్యాయబద్దంగా సాగేందుకు ఈ తనిఖీలు చేపట్టామని డీసీపీ రాజమహేంద్రనాయక్ తెలిపారు. అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్‌పీ పండరీ చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.