News December 3, 2025

అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఇలా..

image

AP: మండలస్థాయిలో ఉన్న ఖాళీలపై MEO ప్రకటన చేయనుండగా, ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను MEO ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్(75%), ప్రొఫెషనల్(25%) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీ‌లోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.

Similar News

News February 15, 2026

గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

image

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

News February 15, 2026

బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

image

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్‌<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.

News February 15, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 15, ఆదివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.18 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.31 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.