News December 1, 2025
అక్కన్నపేట: సర్పంచ్, వార్డ్ మెంబర్ లందరూ ఏకగ్రీవం!

అక్కన్నపేట మండలం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటైన శ్రీరామ్ తండాకు బానోతు వెంకటేష్ సర్పంచ్‌గా తండావాసులంతా ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మారుమూల తండాలో యువకుడిగా ఎంతో కష్టపడి తండాల అభివృద్ధి కోసం పాటుపడిన వెంకటేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అలాగే 8 మందిని వార్డు సభ్యుల ఎన్నిక చేపట్టారు. అనంతరం తండావాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వైభవంగా సంబరాలు చేసుకున్నారు.
Similar News
News February 12, 2026
ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారా?

ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. పనితీరు మార్చుకోని వారితో నేరుగా మాట్లాడతానని సీఎం వెల్లడించారు. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆ 40 మందిలో మీ ఎమ్మెల్యే ఉన్నారని అనుకుంటున్నారా కామెంట్ చేయండి.
News February 12, 2026
శివ నామాలు అర్థాలు ‘‘త్రినేత్ర’’

శివుడి కుడి కన్ను సూర్యుడిని, ఎడమ కన్ను చంద్రుడిని సూచిస్తుంది. ‘జ్ఞాన నేత్రం’ అని పిలిచే మూడో కన్ను అగ్నిని సూచిస్తుంది. సాధారణ కళ్లు భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూస్తాయి. కానీ, మూడో కన్ను అంతరాత్మను, సత్యాన్ని దర్శిస్తుంది. అజ్ఞానాన్ని దహించివేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అంతటి శక్తి ఆ నేత్రమయం. అందుకే ఆయనను ముక్కంటి/త్రినేత్రుడు అంటారు. కామదహనంలో ఆయన తన మూడో కంటితోనే మన్మథుడిని భస్మం చేశాడు.
News February 12, 2026
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


