News August 3, 2024
అక్టోబరు 4 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అధికారులతో సమీక్ష సమావేశంనిర్వహించారు. అడిషనల్ ఈ.ఓ మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News September 7, 2024
వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న చిత్తూరు ఎస్పీ
చిత్తూరు జిల్లా కేంద్రంలోని పోలీసు క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుడి విగ్రహానికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎస్పీ మణికంఠ పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకల విజయాలు అందించాలని కోరుకున్నట్టు చెప్పారు. సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ భాస్కర్ పాల్గొన్నారు.
News September 7, 2024
తిరుమల క్యూలైన్లో మహిళ మృతి
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గుండెపోటుతో మహిళ మృతి చెందింది. కడపకు చెందిన ఝాన్సీ (32) శనివారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్ లో గుండెపోటుకు గురై చనిపోయింది. అయితే అంబులెన్స్ గంట ఆలస్యంగా వచ్చిందని..సకాలంలో అందుబాటులో ఉంటే తన బిడ్డ బతికేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.తమ కుమార్తె మృతికి టీటీడీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని బోరున విలపించారు.
News September 7, 2024
సత్యవేడు MLAపై అత్యాచార కేసు..UPDATE
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధిత మహిళను పోలీసులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేయడానికి చికిత్సలు చేయించుకోమన్నారు. అయితే ఆమె పరీక్షలకు నిరాకరించినట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు అవుతాయని వైద్యులు, పోలీసులు చెప్పినా వినకుండా వెళ్లిపోయిందన్నారు. మరో రెండురోజుల్లో పరీక్షలకు వస్తానని చెప్పారన్నారు.