News August 12, 2025

అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షిషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లు, వనమహోత్సవం, గృహజ్యోతి, మహాలక్ష్మి, సౌర విద్యుత్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలనను రోజువారీగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 10, 2026

ADB: నేటి INTER పరీక్షకు 385 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని DIEO జాధవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తం 8,520 మంది విద్యార్థులకు గాను 8,135 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 292 మంది, ఒకేషనల్ విభాగంలో 93 మంది కలిపి మొత్తం 385 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 10, 2026

ఆదిలాబాద్ సింగం.. ONE YEAR COMPLETE

image

ఆదిలాబాద్ జిల్లా SPగా అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాదయింది. ఈ ఏడాది కాలంలో ప్రజలు సేవలందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు. క్రైంను అదుపులోపెట్టి మహిళలకు అండగా ఉంటూ దోపిడీదారుల పాలిట సింహ స్వప్నంలా మారారు. శాఖలో మార్పులు, కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఇలాంటి ఎస్పీనే ఉండాలంటూ ఆదిలాబాద్ కా షేర్, సింగం అంటూ ప్రజల నుంచి మన్ననలు పొందారు.

News March 9, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.