News February 10, 2025

అక్రమ కేసులకు భయపడం: మాజీ మంత్రి కాకాని

image

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ సానుభూతిపరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేయిస్తున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారులను వదిలిపెట్టమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకానిగోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. గూడూరు మండలం మంగళపూర్‌లో వైసీపీ సానుభూతిపరుడు సతీశ్ యాదవ్‌ను కాకాని పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

Similar News

News February 16, 2026

కార్పొరేటర్లతో బస్సులో బయలుదేరిన రామగుండం ఎమ్మెల్యే

image

కరీంనగర్ నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి MLA M.S రాజ్ ఠాకూర్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు బస్సులో బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కొద్ది గంటల్లో జరగనుంది. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ఎన్నిక నగర రాజకీయాల్లో కీలకంగా మారింది. కార్యాలయం వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అధికార పీఠం ఎవరికనే ఉత్కంఠ నెలకొంది.

News February 16, 2026

అభిషేక్ ఫ్లాప్ షో.. 6 మ్యాచుల్లో 4 డకౌట్స్

image

T20Iల్లో భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఫ్లాప్ షో నడుస్తోంది. T20WCలో ఆడిన 2 మ్యాచుల్లోనూ సున్నాకే వెనుదిరిగారు. అటు చివరి 6 మ్యాచుల్లో 4 సార్లు డకౌట్(0, 68*, 0, 30, 0, 0,) అయ్యారు. అభిషేక్ టాలెంట్‌పై సందేహం లేకపోయినా T20WCలాంటి పెద్ద వేదికల్లో ఇలా నిలకడ చూపకపోవడం ఆందోళన కలిగించే అంశం. అటు ఈ ఫార్మాట్లో భారత ఓపెనర్లలో అత్యధికంగా రోహిత్ 10సార్లు, ఆ తర్వాత అభిషేక్&రాహుల్ 5సార్లు డకౌట్ అయ్యారు.

News February 16, 2026

NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.