News November 19, 2025

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

image

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్‌ ఇష్యూస్‌ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్‌&డైలాగ్‌ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Similar News

News January 13, 2026

10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.

News January 13, 2026

పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

image

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.

News January 13, 2026

కుక్కలపై ప్రేముంటే ఇళ్లకు తీసుకెళ్లండి: సుప్రీంకోర్టు

image

వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిలో ఎవరైనా గాయపడినా లేదా మరణించినా స్థానిక అధికారులు, కుక్కలకు ఆహారం పెట్టే వారే (Feeders) బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వాటిపై ప్రేమ ఉన్నవారు ఇళ్లకు తీసుకెళ్లాలని, ప్రజలను భయపెట్టేలా రోడ్లపై వదలొద్దని జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం పేర్కొంది. బాధితులకు భారీ పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించింది.