News November 19, 2025
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి..

అస్సాంకు చెందిన పల్లవి చెన్నైలో జెండర్ ఇష్యూస్ అనే అంశంపై పీజీ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధానికి పనిచేసే శక్తివాహిని అనే ఎన్జీవోలో వాలంటీరుగా చేరారు. 2020లో సొంతంగా ఇంపాక్ట్&డైలాగ్ ఎన్జీవో స్థాపించి మానవ అక్రమరవాణాపై పోరాటం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు 7వేలమందికి పైగా బాధితులను కాపాడారు. ఈ క్రమంలో ఎన్నో బెదిరింపులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
Similar News
News January 16, 2026
రూ.13 వేల కోట్ల ప్లాంట్.. రేపే శంకుస్థాపన!

కాకినాడ రూరల్‌లో రూ.13 వేల కోట్లతో నిర్మించనున్న గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు శనివారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే కొండబాబు, ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ ప్లాంట్ వద్ద పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
News January 16, 2026
AIIMS రాయ్‌పూర్‌లో ఉద్యోగాలు

AIIMS రాయ్‌పూర్ 40 జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 19న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. MBBS ఉత్తీర్ణతతో పాటు DMC/NMC/స్టేట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.aiimsraipur.edu.in
News January 16, 2026
Money Tip: మీకు మీరే శిక్ష వేసుకోండి.. వినూత్న పొదుపు మంత్రం!

మీకున్న చెడు అలవాట్లపై మీరే పన్ను వేసుకోండి. డబ్బు ఆదా చేయడానికి ఇదొక వినూత్న మార్గం. అనవసర ఖర్చు చేసినప్పుడు అంతే మొత్తాన్ని పెనాల్టీగా మీ సేవింగ్స్ అకౌంట్‌లోకి డిపాజిట్ చేయండి. Ex ఒక బర్గర్ కొంటే దానికి సమానమైన డబ్బును వెంటనే అకౌంట్‌కు మళ్లించాలి. ఇలా చేస్తూ వెళ్తే పోగైన డబ్బును బట్టి మీకున్న బ్యాడ్ హాబిట్స్ వల్ల ఎంత నష్టమో తెలుస్తుంది. అలాగే క్రమశిక్షణ అలవడుతుంది. పొదుపు అలవాటవుతుంది.


