News March 27, 2024

అక్రమ రవాణా పై ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నాం: ఎస్పీ

image

జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయబడిన చెక్‌పోస్టుల ద్వారా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ గంజాయి, నాటు సారా, మద్యం, నగదు అక్రమ రవాణా జరగకుండా పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు  ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి జిల్లా వ్యాప్తంగా 31ప్లయింగ్ సర్వీసెస్ టీమ్‌లు తిరుగుతున్నాయని అన్నారు.

Similar News

News February 13, 2026

ఆకివీడులో ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

ఆకివీడు 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ హైమావతి, వైసీపీ కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, నాయకులు రుంకాని శ్రీహరి‌లు ఫిర్యాదు చేశారు. తన వార్డు పరిధిలో కూటమి నాయకులు సీసీ రోడ్డు ప్రారంభంలో ప్రొటోకాల్ ఉల్లంఘించారని, చర్యలు తీసుకోవాలని హైమావతి కలెక్టర్‌ను కోరారు.

News February 13, 2026

ప.గో: దళారుల చేతిలో తీర ప్రాంత యువత విలవిల

image

మెరుగైన జీతం కోసం విదేశాలకు వెళ్లాలనే కోస్తా తీర నిరుద్యోగుల ఆశ దళారులకు వరంగా మారుతోంది. ఆయిల్ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ముంచుతున్నారు. ఈప్రాంతంలో ఆయిల్ రిగ్గులపై పనిచేసిన అనుభవం ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో, దళారులు సులభంగా బుట్టలో వేసుకుంటున్నారు. అప్పులు చేసి డబ్బులు చెల్లించిన యువత, తీరా మోసపోయామని తెలిసి లబోదిబోమంటున్నారు.

News February 13, 2026

వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

image

ప.గో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒకటి నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని దిశానిర్దేశం చేశారు.