News November 19, 2025

అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

image

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.

Similar News

News January 24, 2026

మద్దూరులో యువకుడి ఆత్మహత్య

image

మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లిలో భీమేశ్ (19) అనే యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పొలానికి వెళ్లే దారిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

News January 24, 2026

రథ సప్తమి పూజ ఎలా చేయాలంటే..?

image

రథసప్తమి నాడు సూర్యరశ్మి పడే చోట ఆవు పేడతో శుద్ధి చేయాలి. పిడకల పొయ్యి పెట్టాలి. ఇత్తడి పాత్రలో ఆవు పాలను పొంగించాలి. పాలు పొంగే సమయంలో కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం చేయాలి. దాన్ని చిక్కుడాకుల్లో సూర్యుడికి నివేదించాలి. అనంతరం అందరికీ వితరణ చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే చిక్కుడు కాయలు, కొబ్బరి పుల్లలతో చిన్న రథాన్ని తయారు చేసి పూజించాలి. పాలు పొంగడం ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు.

News January 24, 2026

శబరిమలలో మూవీ షూటింగ్? విచారణకు ఆదేశం!

image

అయ్యప్ప సన్నిధానంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా షూటింగ్ జరిగిందన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మలయాళ డైరెక్టర్ అనురాజ్ మనోహర్ నిషేధిత ప్రాంతంలో వీడియోగ్రఫీ చేశారన్న ఫిర్యాదుపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. షూటింగ్‌కు అనుమతి అడిగినా బోర్డు నిరాకరించిందని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాము పంబలో మాత్రమే వీడియో తీశామని మనోహర్ తెలిపారు.