News November 19, 2025
అఖండ పల్నాడు రారాజు అనుగు రాజు యాదవ్ గురించి తెలుసా..?

పల్నాడు చరిత్ర అనగానే బ్రహ్మనాయుడు, నాగమ్మ గుర్తుకొస్తారు. అయితే అఖండ పల్నాడును పరిపాలించిన అనుగురాజు యాదవ్ పాత్ర కీలకమైనది. ఈయనకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కుమారుడు మలిదేవుడు మాచర్ల రాజధానిగా బ్రహ్మనాయుడు మంత్రిగా, చిన్న భార్య కుమారుడు నలగామ రాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిగా పరిపాలించారు. దాయాదుల మధ్య జరిగిందే పల్నాటి యుద్ధం అనుగరాజ గుర్తుగా పిడుగురాళ్లలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.
Similar News
News January 16, 2026
OTTలో కొత్త సినిమాలు.. చూసేయండి!

సంక్రాంతి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలు OTTలోకి వచ్చాయి. శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, ఫర్హాన్ అక్తర్, రాశీఖన్నా ‘120 బహదూర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో, జగపతిబాబు, సుహాసిని తదితరులు నటించిన ‘అనంత’ మూవీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ZEE5లో గుర్రం పాపిరెడ్డి, సోనీలివ్‌లో మమ్ముట్టి ‘కలాంకావల్’ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వారం కిందట బాలయ్య ‘అఖండ-2’ విడుదలైంది.
News January 16, 2026
సంగారెడ్డి: మున్సిపల్ రిజర్వేషన్లపై ఉత్కంఠ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కేటగిరీల వారిగా రిజర్వేషన్లను ప్రకటించారు. దీంతో ఏ వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. మరో రెండు రోజుల్లో వార్డుల వారిగా రిజర్వేషన్లు విడుదలై అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల రిజర్వేషన్లు ఖరారైనట్లు సమాచారం. అయితే అధికారికంగా రిజర్వేషన్లు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఆశావహులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News January 16, 2026
KNR: ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ములకాలపల్లిలో 12.4℃, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని గజసింగారంలో 12.8℃, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్‌లో 12.9℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో 13.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


