News August 11, 2025
అచ్చంపేటలో జాతీయ నులిపురుగు దినోత్సవం

జాతీయ నులి పురుగు దినోత్సవాన్ని పురస్కరించుకొని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నులి పురుగు నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్రతి ఒక్కరు మాత్రలను వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలస్వామి వైద్య సిబ్బంది ఉన్నారు.
Similar News
News March 9, 2026
రంగారెడ్డి జిల్లాలో రైతు రిజిస్ట్రేషన్ 88% పూర్తి

రంగారెడ్డి జిల్లా పరిధిలో రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు ఫోకస్ చేశారు. జిల్లాలో మొత్తం 1,97,029 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 88% రిజిస్ట్రేషన్ మాత్రమే పూర్తైనట్లుగా అధికారులు తెలిపారు. పీఎం కిసాన్ లాంటి పథకాలు అందాలంటే రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News March 9, 2026
BREAKING.. దండేపల్లి: విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి

దండేపల్లి మండలం మేదరిపేట ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్సై తహసీద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి ఇనుప స్టాండ్‌ను తీసుకెళ్లే క్రమంలో మెయిన్ లైన్ విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యారు. మృతులు మేదరిపేటకు చెందిన సల్లా లక్ష్మీనారాయణ, కాజీపేటకు చెందిన నాగరాజుగా గుర్తించారు. వారు సిమెంట్ ట్రేడర్స్‌లో పని చేస్తున్నారు.
News March 9, 2026
మంగళగిరి ఎయిమ్స్‌లో డయేరియా కలకలం

మంగళగిరి AIIMS వసతిగృహంలో డయేరియా కలకలం రేపింది. 3 రోజులుగా వాంతులు, విరేచనాలతో 25 మంది విద్యార్థులు, సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చికిత్స అందిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ పరిస్థితికి కారణమని అనుమానిస్తున్న అధికారులు, హాస్టల్ నుంచి 40 నీటి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టులు వచ్చిన తర్వాత అసలు కారణాలు వెల్లడిస్తామని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.


