News November 19, 2025
అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
Similar News
News January 23, 2026
సంగారెడ్డి: ఇంటర్ హాల్ టికెట్లు సరి చూసుకోండి

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ హాల్ టికెట్లు సరిచూసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం సూచించారు. http://tgbie.cgg.gov.inలో హాల్ టికెట్ చూసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే ఈనెల 25వ తేదీలోపు సరిచేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని కోరారు.
News January 23, 2026
సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీసిటీ వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. M.Tech ఇన్ ECE పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://iiits.ac.in/careersiiits/jrf-srf-project-positions/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 27.
News January 23, 2026
రాయచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డల మృతి

అన్నమయ్య జిల్లా రాయిచోటిలో ఆపరేషన్ వికటించి తల్లిబిడ్డలు మృతి చెందిన విషాదకర ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాయచోటిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రి వద్ద చోటుచేసుకున్న ఘటన వివరాలను మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. పెద్దమండెం మండలం చింతమానివారిపల్లికి చెందిన తవలం వెంకటరమణ భార్య ఈశ్వరమ్మ ప్రసవ నొప్పులతో రాయచోటిలోని ఓ ఆసుపత్రికి వెళ్లగా ఈ ఘటన జరిగిందన్నారు.


