News November 19, 2025

అచ్చంపేట: పాము పడుతూ.. స్నేక్ క్యాచర్‌కు కాటు

image

అచ్చంపేట పట్టణం రెడ్డి భవన్ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో రక్తపింజర పాము కనిపించడంతో స్థానికులు స్నేక్ క్యాచర్ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న సుమన్ పామును పట్టుకునే ప్రయత్నంలో అనుకోకుండా అతని చేతికి పాము కాటేసింది. తక్షణమే అక్కడున్న వారు సుమన్‌ను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

Similar News

News January 19, 2026

జగిత్యాల జిల్లాలో 6వ రోజు తనిఖీలు

image

జగిత్యాల జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఆదివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ అనలైజర్లతో వాహనదారులను పరీక్షించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేయడమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని పోలీసులు హెచ్చరించారు.

News January 19, 2026

నాన్న ఎదుట ఏడ్చేవాడిని: హర్షిత్ రాణా

image

తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఫెయిల్యూర్స్ గురించి భారత క్రికెటర్ హర్షిత్ రాణా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘పదేళ్లపాటు నేను ఎంపిక కాలేదు. ట్రయల్స్‌కు వెళ్లడం, నా పేరు ఉండకపోవడం జరిగేది. ఇంటికొచ్చి నాన్న ఎదుట ఏడ్చే వాడిని. ఇప్పుడు ఆ వైఫల్యాలు పోయాయని భావిస్తున్నా. ఏం జరిగినా ఎదుర్కోగలను’ అని చెప్పారు. ఇప్పటిదాకా 14 వన్డేలు ఆడిన హర్షిత్ 26 వికెట్లు పడగొట్టారు. NZతో మూడో వన్డేలో 3 వికెట్లు తీశారు.

News January 19, 2026

చరిత్ర చెదిరిపోకుండా అభివృద్ధి పనులు: CM

image

చరిత్ర చెదిరిపోకుండా, సంస్కృతి, సంప్రదాయం వర్ధిల్లేలా, భక్తుల విశ్వాసం ద్విగుణీకృతం అయ్యేలా, ఆచారాలు శాశ్వతంగా నిలిచేలా, సమ్మక్క-సారలమ్మల వీర చరిత్ర మరో వెయ్యేళ్లైనా నిలిచిపోయేలా మేడారంలో చేపట్టిన శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మేడారం పుణ్యక్షేత్రాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు.