News June 17, 2024

అచ్చంపేట: రోడ్డు పక్కన యువకుడి మృతదేహం

image

అచ్చంపేట మండలం లింగోటం పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి పక్కన అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం.. మృతుడు ఉప్పునుంతల మండలం కట్లబండ తండాకు చెందిన గణేష్(30)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గణేష్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. 

Similar News

News January 22, 2026

MBNR: సంక్రాంతి ఆదాయంలో ఆర్టీసీ రికార్డు.. రాష్ట్రంలోనే టాప్.!

image

సంక్రాంతి పండుగ వేళ MBNR ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 794 ప్రత్యేక బస్సులతో 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి ₹22.70 కోట్ల ఆదాయం సాధించినట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. 109% ఆక్యూపెన్సీ రేషియోతో తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. సుమారు 34.48 లక్షల కి.మీటర్లు బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు.

News January 22, 2026

పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

image

పాలమూరు కార్పొరేషన్​లో కార్పొరేటర్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్​ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.

News January 21, 2026

మహబూబ్‌నగర్: ‘నియమాలు పాటిస్తేనే ప్రయాణం సురక్షితం’

image

ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారన్న విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. నిర్లక్ష్యం వీడి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు.