News September 12, 2025

అచ్చంపేట: షూటింగ్ బాల్ ఎంపికలు

image

ఈ నెల 14న అచ్చంపేట పట్టణంలోని గౌతమి హైస్కూల్‌లో జూనియర్స్ బాలుర షూటింగ్ బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజగిరి మల్లేష్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ తెలిపారు. ఏప్రిల్ 1, 2006 తర్వాత జన్మించిన అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో ఎంపికలకు హాజరు కావాలని వారు సూచించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 8, 2025

రూ.500 కోట్ల కామెంట్స్.. కాంగ్రెస్ నుంచి సిద్ధూ భార్య సస్పెండ్

image

సీఎం పోస్ట్ కొనుక్కోవడానికి తమ వద్ద రూ.500 కోట్లు లేవంటూ సంచలన కామెంట్స్ చేసిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్‌ను పార్టీ నుంచి పంజాబ్ కాంగ్రెస్ తొలగించింది. ఈ సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అమరిందర్ సింగ్ తెలిపారు. కాగా ఆమె వ్యాఖ్యలు పంజాబ్‌లో తీవ్ర దుమారం రేపడంతో తన కామెంట్స్‌ను వక్రీకరించారని కౌర్ అన్నారు.

News December 8, 2025

జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

image

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.

News December 8, 2025

అపార్ ఐడి పురోగతిని వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పలు మండలాల్లో అపార్ ఐడి పురోగతి చాలా నెమ్మదిగా ఉందని వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె అధికారులకు సూచనలు సలహాలు చేశారు. మహానంది పగిడాల బేతంచెర్ల జూపాడుబంగ్లా శ్రీశైలం మండలాలలో చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. విద్యాశాఖ 95 శాతం లక్ష్యాన్ని సాధించే విధంగా మరింత కృషి చేయాలని సూచించారు.