News April 22, 2025

అచ్చంపేట: స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

image

పట్టణానికి చెందిన పిట్టల దశరథం, జ్యోతిల కుమార్తె పిట్టల స్నేహిత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులతో.. స్టేట్ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్నేహిత భవిష్యత్‌లో ఇంజినీర్‌గా ఎదగాలి అనేది తన కోరిక అని తెలిపింది. ఆమెను కాలేజీ సిబ్బంది అభినందించారు.

Similar News

News March 12, 2026

MBNR: “కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలోని శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి దేవాలయ కొండల వద్ద క్వారీ అనుమతులపై భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ మార్చి 14న ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 1000 చరిత్ర కలిగిన కురుమూర్తి కొండలను కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

News March 12, 2026

సిరిసిల్ల: ఇంటర్ పరీక్షలకు 131 మంది గైర్హాజరు

image

సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,295 మంది విద్యార్థులకు గాను 4,164 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 131 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

News March 12, 2026

ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

image

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.