News March 31, 2024
అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూత

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తల్లి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో కింజరాపు కళావతమ్మ (90) ఇవాళ మధ్యాహ్నం చనిపోయారు. కళావతమ్మకు ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఆమె మరణంతో కింజరాపు ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 18, 2026
రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.
News February 18, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.
News February 17, 2026
SKLM: జిల్లా స్థాయి చదరంగం పోటీల విజేతలు వీరే

శ్రీకాకుళం ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి చదరంగం పోటీలు మంగళవారం ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు100 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. పదమూడేళ్ల లోపు బాలికల విభాగంలో బొల్లా శృతి, వి. రోహిణి, బాలుర విభాగంలో జయంత్ భాను తేజ్ సత్తా చాటారు. 15ఏళ్ల లోపు బాలుర విభాగంలో బొల్ల జస్వంత్ కార్తికేయ, బాలికల విభాగంలో ప్రాణీత లోచన మెరిశారు.


