News August 23, 2025
అటువంటి ఉపాధ్యాయులను వదలొద్దు: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఉపాధ్యాయులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జిల్లాలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థుల పట్ల రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
Similar News
News January 15, 2026
ప్రకాశం: ట్రాక్టర్ రివర్స్ పోటీలు

దర్శి మండలం రాజంపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను దర్శి టీడీపీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆమె మాట్లాడుతూ.. సంక్రాంతి వంటి పండుగలు గ్రామీణ క్రీడలను, రైతు సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, ఇలాంటి వినూత్న పోటీలు యువతలో నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
News January 14, 2026
సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజాబాబు

సంక్రాంతి పండగ సందర్భంగా మార్కాపురం జిల్లా ప్రజలకు ఇన్‌ఛార్జి కలెక్టర్ రాజబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే పల్లెల పండగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను అందరిని కలుసుకొని కను విందులు చేసే అందరి పండగ సంక్రాంతి అన్నారు. రైతులకు పంట చేతికి వచ్చే కాలమని, ఆనందాన్ని కుటుంబంతో పంచుకొని సంతోషించే వేడుక సంక్రాంతి అన్నారు.
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.


