News February 18, 2025

అడవులకు నిప్పు పెడితే చర్యలు: ఎస్పీ రత్న

image

అడవులకు నిప్పుపెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న హెచ్చరించారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల కొందరు అకతాయిలు కొండలు, అడవులకు నిప్పు పెట్టడం బాధాకరమని అన్నారు. అకతాయిల చేష్టలతో దట్టమైన అడవులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు అగ్నికి ఆహుతి అవుతున్నాయని, అడవులకు నిప్పు పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 17, 2026

జగిత్యాల మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అమావాస్య, ఉగాది సందర్భంగా మార్చి 18, 19వ తేదీల్లో మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్చి 20 నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు గమనించి సహకరించాలని కోరారు.

News March 17, 2026

సీఎం హార్వర్డ్ కోర్సుకు ప్రభుత్వమే ఫీజు చెల్లించింది: KTR

image

TG: సీఎం రేవంత్ <<18999625>>హార్వర్డ్<<>> కోర్సు ఫీజులు, విమాన ఖర్చులు ప్రభుత్వమే చెల్లించిందని అసెంబ్లీలో KTR ఆరోపించారు. ‘RTI ద్వారా వివరాలు తెలుసుకున్నాం. సర్కార్ విద్యాశాఖ మంత్రి(రేవంత్) ఫీజులు కడుతుంది కానీ రాష్ట్రంలోని విద్యార్థుల రూ.10వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించదా? గురుకులాల్లో నిత్యం మరణమృదంగం వినిపిస్తోంది. యూనివర్సిటీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది’ అని మండిపడ్డారు.

News March 17, 2026

మెట్రోలో గలీజ్ దందా.. పాత సామాన్లకే కొత్త రంగులేసి

image

METRO కోచ్‌ల మెయింటెనెన్స్ పేరుతో జరుగుతోన్న కొనుగోళ్లు, విదేశాల పార్టులు తెస్తున్నామని లోకల్‌ షెల్ కంపెనీల నుంచి పనికిరాని సామాన్లు కొంటున్నారు. మార్కెట్ రేట్ కంటే 40% అదనంగా బిల్లులేసి ట్యాక్స్ డబ్బుల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పాతసామాన్లకే కొత్తరంగు పూసి ఇన్వెంటరీలో చూపిస్తున్నట్లు క్షేత్రస్థాయి ఆధారాలు చెబుతున్నాయి. పైఅధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోన్నట్లు ఉప్పల్, మియాపూర్ డిపోలలో టాక్.