News November 30, 2025
అత్యధికం మల్లాపూర్.. అత్యల్పం మేడిపల్లి

జగిత్యాల జిల్లాలో మొదటి విడత నామినేషన్లలో మల్లాపూర్ మండలంలో అత్యధికంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేయగా.. అత్యల్పంగా మేడిపల్లి మండలంలో వేశారు. మల్లాపూర్ మండలంలో 180 మంది సర్పంచ్ కు నామినేషన్లు వేయగా 474 మంది వార్డ్ మెంబర్ స్థానాలకు నామినేషన్లు వేశారు. మేడిపల్లి మండలంలో సర్పంచ్ కు 82 మంది నామినేషన్లు వేయగా.. వార్డు మెంబర్ కు 266 మంది నామినేషన్లు వేశారు.
Similar News
News February 15, 2026
శివ నామాలు అర్థాలు ‘‘కాలభైరవ’’

శివుని ఉగ్ర రూపాలలో ‘కాలభైరవుడు’ శక్తివంతమైనది. ‘కాల’ అంటే సమయం అని అర్థం. సమయాన్ని శాసించేవాడు, కాలాన్ని మింగేసేవాడు కాబట్టి ఆయన కాలభైరవుడు. ముఖ్యంగా కాశీ క్షేత్రానికి ఈయనే రక్షకుడు(క్షేత్ర పాలకుడు). తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షించే అధికారం ఈయనకు ఉంటుంది. భక్తుల భయాన్ని పోగొట్టి, శత్రువుల నుంచి రక్షించే దైవం ఈయన. మనలోని అహంకారాన్ని అంతం చేసి మోక్షమార్గాన్ని చూపే దైవంగా ఈయనను ఆరాధిస్తారు.
News February 15, 2026
పెద్దపల్లి: రేపు తెలంగాణ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూలింగ్

రైలు నంబర్ 12723 హైదరాబాద్- న్యూఢిల్లీ తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రేపు 3 గంటలు ఆలస్యంగా బయలు దేరనున్నట్లు నేడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. హైద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన రైలును 3 గంటలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. కాజీపేట, రామగుండం, మంచిర్యాల తదితర ప్రాంతాల ప్రయాణికులు సమయ పాలన మార్పు గమనించాలని సూచించారు.
News February 15, 2026
నర్సంపేటలో ఢిల్లీ పోలీసుల తనిఖీలు..!

వరంగల్ జిల్లా నర్సంపేటలో నకిలీ కంపెనీలు సృష్టించి సుమారు రూ.2.50 కోట్లు మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. వేర్వేరు అడ్రస్‌లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించారు. నిందిత మహిళ ప్రస్తుతం హైదరాబాద్‌లో పబ్ నడుపుతున్నట్లు సమాచారం. ఆమె స్వగ్రామం లక్నేపల్లిలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.


