News August 14, 2025
అత్యవసరం ఉంటే తప్ప బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్

భారీ వర్షాలు కురుస్తుండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రజలను కోరారు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జలమయమైన ప్రాంతాలను పరిశీలించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 13, 2026
MBNR: పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: SP

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పరీక్షా సమయాల్లో (ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు) కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 163 BNSS యాక్ట్ ప్రకారం ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
News March 13, 2026
మహబూబ్‌నగర్: ఫలించని జశ్వంత్ ప్రయత్నం

భూత్పూర్ మండలం వెల్కిచర్లలో గురువారం ఓ తల్లి పిల్లలతోకలిసి బావిలోదూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఆమె కుమారుడు జశ్వంత్( 8)వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంపట్ల గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. బాలుడు బావిలోని ఎత్తు ప్రదేశంలో పడటంతో ఒడ్డుకుచేరుకొని వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులకు చెప్పడంతో గాలింపు చేపట్టారు. కానీ అప్పటికే తల్లి, కూతుళ్లు మృతి చెందారు.
News March 12, 2026
MBNR: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ

మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఈనెల 28వ తేదీన లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జడ్జి ప్రేమలత తెలిపారు. రాజీ పడే ప్రతి కేసులను రాజు ద్వారానే పరిష్కారం చేసుకోవాలని రాజీ మార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1334 కేసులను గుర్తించామని, అందులో 32 కేసులను పరిష్కారం చేశామని తెలిపారు. సివిల్, కుటుంబం, యాక్సిడెంట్, ఫ్రీ లిటిగేషన్ వంటి కేసులను పరిష్కారం చేసుకోవచ్చన్నారు.


