News November 30, 2025
అది అభివృద్ధి కాదు.. భూ దోపిడీ: బొత్స

విశాఖ భూముల దోపిడీకి అడ్డాగా మారిందని MLC బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టాల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ‘లులూ ఒక పనికిమాలిన సంస్థ. రూ.కోట్లు విలువైన భూములను 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. విశాఖలో భూములు వేలం పెట్టి ఇవ్వాలి’ అని అన్నారు. కేజీహెచ్, భోగాపురం అంశాల్లో కూడా ప్రభుత్వం వైఖరిని ఆయన తప్పుబట్టారు.
Similar News
News February 18, 2026
మదనపల్లె: ఈ నంబర్ సేవ్ చేసుకోండి..!

అన్నమయ్య జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు ఆదేశించారు. పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. 50 కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 28,550 మంది హాజరవుతారని చెప్పారు. CC కెమెరాలు, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు, తాగునీరు, మరుగుదొడ్లు, RTC బస్సులు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే 9866112750కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News February 18, 2026
EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 18, 2026
CM రిక్వెస్ట్.. కుప్పంలో 2 ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపింగ్

CM చంద్రబాబు రిక్వెస్ట్ నేపథ్యంలో కుప్పంలో 2 ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్‌కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 10న CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి కుప్పంలో వాస్కోడగామా-వేలంకణి, దాదర్ సెంట్రల్-పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో 2 రైళ్ల స్టాపింగ్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్రమంత్రి CM చంద్రబాబుకు లేఖ రాశారు.


