News November 30, 2025

అదే నిజమైతే వారిద్దరూ టెస్టులు ఆడాలి: పీటర్సన్

image

టెస్టుల్లో భారత పేలవ ప్రదర్శన నేపథ్యంలో రోహిత్-కోహ్లీ రీఎంట్రీపై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం స్పందించారు. ‘ఒకవేళ వారిద్దరూ తిరిగి టెస్టుల్లో ఆడాలని భావిస్తున్నారన్నది సగం నిజమైనా సరే దానిని సీరియస్‌గా తీసుకోవాలి. టెస్టు క్రికెట్ మనుగడపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వారిద్దరూ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటే కచ్చితంగా ఆడాలి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 13, 2026

జెన్ జీ లవ్ స్టోరీల్లో ‘ఆరెంజ్’ ఫ్లేవర్!

image

నేటి సోషల్ మీడియా యుగంలో ప్రేమలు ‘ఇన్‌స్టంట్’ అయిపోయాయి. జెన్ జీల పోకడతో బంధాలు కలకాలం ఉండటం కలగా మారుతోంది. ప్రతి వాలంటైన్స్ డేకి ఓ కొత్త జంట పుట్టుకొస్తోంది. కానీ ఆ ప్రేమ మొక్కగా ఎదిగేలోపే మనస్పర్ధల తుఫానుకు రాలిపోతోంది. ‘ప్రేమ అంటే కొన్నాళ్లే బాగుంటుంది’ అనే ‘ఆరెంజ్’ సినిమా సిద్ధాంతాన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఈ ‘షార్ట్ టర్మ్’ రిలేషన్‌షిప్ వల్ల పాతకాలపు శాశ్వత అనుబంధాలు కనుమరుగవుతున్నాయి.

News February 13, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News February 13, 2026

‘వారణాసి’ జానర్‌పై క్లారిటీ

image

వారణాసి సినిమా జానర్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ కాదని.. మైథలాజికల్ ఫాంటసీ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రన్‌టైమ్ 3 గంటలకు కాస్త తక్కువ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని.. మిగిలిన దాన్ని జూన్ 2026 కల్లా కంప్లీట్ చేస్తామన్నారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, VFX వర్క్‌పై ఫోకస్ పెడతామని పేర్కొన్నారు.