News April 21, 2024
అద్దంకిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం

అద్దంకి పట్టణంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం బీభత్సం సృష్టించింది. ఒంగోలు వైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అద్దంకి పట్టణంలో సత్యనారాయణ కళామందిరం దగ్గరికి వచ్చేసరికి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సందర్భంలో ట్రావెల్స్ బస్సు ఆగకుండా వెళ్లి గోపాలపురం దగ్గర మరొక ట్యాలీ వ్యాన్‌ను ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!

ప్రకాశం: PTMకు ముస్తాబైన పాఠశాలలు

జిల్లా కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో జిల్లాలోని 2,409 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (PTM) నిర్వహిస్తున్నట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. పాఠశాలల్లో ఉదయం 10 గంటల నుంచి షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాన్ని జరపాలని అన్నారు. PTM కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పాఠశాలల్లో పూర్తి చేసి, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముస్తాబు చేశారు.