News September 10, 2024

అద్దంకి : ఇద్దరు మంత్రుల చొరవ.. రాత్రికి రాత్రే రక్ష

image

భారీ వర్షాలు, వరదలకు బాపట్ల జిల్లాలోని పెదపులివర్రు, పెనుమూడి, రుద్రవరం, రావిఅనంతారం గ్రామాల్లో కుడికరకట్ట చాలాచోట్ల బలహీనపడింది. దీంతో మంత్రులు అనగాని, గొట్టిపాటి అధికారులతో చర్చించి పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికుల సాయంతో 100కి పైగా ట్రాక్టర్ల మట్టిని 15వేలకుపైగా బస్తాల్లో నింపి రాత్రికి రాత్రి కరకట్టపై రక్షణ కవచంలా ఏర్పాటు చేశారు.

Similar News

News October 10, 2024

భైరవకోనలో సినీ నటుడు శ్రీకాంత్

image

చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనను సినీ నటుడు శ్రీకాంత్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా త్రిముఖ దుర్గాంబిక అమ్మవారిని, శివయ్యను, భైరవేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం శ్రీకాంత్‌ను సత్కరించారు.

News October 10, 2024

ప్రకాశం: ఈ కష్టం ఎవరికీ రాకూడదు..!

image

అతనో పేద రైతు. ఎంతో కష్టపడ్డాడు. అయినా సరే అప్పులే మిగిలాయి. మరోవైపు ఎదిగి వచ్చిన కుమార్తె పెళ్లి. తప్పనిస్థితిలో మరో రూ.3 లక్షలు అప్పు తెచ్చి ఇంట్లో పెట్టాడు. అర్ధరాత్రి ఆ నగదును దొంగలు దోచేశారు. ఉదయాన్నే నిద్రలేచిన రైతుకు డబ్బు కనపడకపోవడంతో బోరున విలపించారు. ఈ <<14311035>>బాధాకరమైన<<>> ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోపాలునిపల్లె గ్రామంలోని వీరంరెడ్డి వాసుదేవరెడ్డి ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

News October 10, 2024

ALERT: పొగాకు ఎక్కువ పండించకండి

image

టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో బుధవారంతో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తం 16.1 మిలియన్ల పొగాకు కొనుగోళ్లు చేసినట్లు వేలం కేంద్రం అధికారి అట్లూరి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కిలో పొగాకు సరాసరి రూ.221లు రైతులకు లభించింది. ఈ ఏడాదికి రూ.279 అందినట్లు చెప్పారు. ప్రస్తుత ధర పోల్చుకుని పొగాకు అత్యధికంగా పండిస్తే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు.