News August 11, 2025
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారి

రాబోయే మూడు రోజుల్లో జాతీయ భావాన్ని ప్రజల్లోకి చేర్చేలా క్షేత్రస్థాయిలో చురుకైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం, దానికి గౌరవం ఇవ్వడం, ఐక్యతను ప్రదర్శించడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో “హర్ ఘర్ తిరంగా”పై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ర్యాలీలు, ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News March 6, 2026
మార్చి 7న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో టీటెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 5, 2026
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.