News March 15, 2025

అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

image

పరకాల నియోజకవర్గ యువత, మహిళలు స్వయం ఉపాధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అధికారులు తోడ్పడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పరకాల నియోజకవర్గం పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్,ట్రైనింగ్ సెంటర్, డెయిరీల ఏర్పాటు పై జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News February 16, 2026

మెదక్: మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రతా: ఎస్పీ

image

మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ మున్సిపాలిటీల ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లా పరిధిలో 163 BNSS ( సెక్షన్ 144) ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.

News February 16, 2026

గద్వాల: మూడు తరాలు.. ఒకే కుటుంబం.. తుమ్మల వారి అరుదైన రికార్డు!

image

గద్వాల మున్సిపల్ రాజకీయంలో ‘తుమ్మల’ కుటుంబం సరికొత్త చరిత్ర సృష్టించింది. 1988లో మామ, 2000లో అత్త, 2014లో భర్త కౌన్సిలర్లుగా ఎన్నికవ్వగా.. ఇప్పుడు అదే వారసత్వంతో తుమ్మల జయలక్ష్మి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 30 ఏళ్లుగా మూడు తరాలుగా విజయం సాధిస్తూ ఈ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

News February 16, 2026

12 ఏళ్లకే వండర్ చేశాడు

image

Phd విద్యార్థుల కలను ఏడో తరగతి విద్యార్థి మెక్‌మిలన్(12) సాధించాడు. US డల్లాస్‌లో చిన్న ప్లేరూమ్‌లో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్‌ను నిర్మించాడు. 8 ఏళ్లకే న్యూక్లియర్ ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచుకున్న చిన్నోడు ఓ సంస్థ సాయంతో ఈ ప్రాజెక్టును నిర్మించాడు. శాస్త్రీయ ఆవిష్కరణలకు వయసుతో సంబంధం లేదని చాటాడు. 2 తేలికైన పరమాణు కేంద్రకాలు కలిసి బలమైన కేంద్రకంగా మారినప్పుడు భారీగా శక్తి విడుదలవ్వడమే ఈ ప్రక్రియ.