News December 9, 2024

అధికారులను అలర్ట్ చేశాం: కలెక్టర్

image

ఏలూరు జిల్లా రైతులు తమ సమస్యలను నెం.18004256453, 08812-230448, 7702003584 ఫోన్ చేసి తెలపాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న 48 గంటల్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులను అలర్ట్ చేశామన్నారు. రైతుల సమస్యలను దగ్గరలోని అధికారులకు తెలపాలన్నారు.

Similar News

News January 21, 2025

ప.గో. కోళ్లకు అంతు చిక్కని వైరస్.. లక్షకు పైగా మృతి

image

కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకి మృత్యువాత పడటంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో లక్షకు పైనే కోళ్లు మృతి చెందినట్లు చెబుతున్నారు. పందెం కోళ్లకు సైతం వైరస్ సోకి చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు సాయంత్రానికి మృతి చెందుతున్నాయని చెబుతున్నారు. వైరస్ ప్రభావంతో అమ్మకాలు తగ్గి, ధరలు పతనమవుతున్నాయని అంటున్నారు.

News January 21, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ ఉద్యోగి మృతి

image

చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామానికి చెందిన జువ్వనపూడి విక్రమ్ మృతి చెందాడు. హైదరాబాద్ లో విక్రమ్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. సంక్రాంతి పండుగకు చిల్లబోయినపల్లి ఇంటికి వచ్చాడు. తిరిగి సోమవారం బైక్‌పై హైదరాబాద్ వెళ్తుండగా వెలిమినేడు వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన విక్రమ్ అక్కడిక్కడే మృతి చెందాడు.

News January 21, 2025

ద్వారకాతిరుమల: పిల్లి పిల్లను తల్లిలా సాకుతున్న శునకం

image

ద్వారకాతిరుమల వసంత్ నగర్ కాలనీలో ఒక శునకం పిల్లి పిల్లను కన్న తల్లిలా సాకుతుండటం అబ్బురరుస్తోంది. తన వెంట తిప్పుకుంటూ ఆడిస్తుండటం ముచ్చట గొలుపుతోంది. అంతేకాదు ఆ పిల్లికి పాలిచ్చి మరీ పెంచుతోంది. కుక్కను చూస్తే ఆమడ దూరం పారిపోయే పిల్లి పిల్ల సైతం శునకంతో కలిసి ఉండటం చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ రెండూ నలుపు రంగులో ఉండటంతో అకస్మాత్తుగా వాటిని చూసినవారు నిజంగా అవి తల్లీపిల్ల అని అనుకుంటున్నారు.