News March 5, 2025

అధికారులు అద్భుతంగా పనిచేశారు: కలెక్టర్ 

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. దీనికి సహకరించిన అధికారులు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలిపారు. అందరూ టీమ్ స్పిరిట్‌తో అద్భుతంగా పనిచేశారన్నారు. ఉద్యోగులు.. ఎన్నికల విధుల్లో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారన్నారు. ఎన్నికల నిర్వహణలో పట్టభద్రుల నియోజవర్గ పరిధిలోని 6 జిల్లాల యంత్రాంగం సహకారం అందించారన్నారు.

Similar News

News December 7, 2025

ఈ నెల 10 నుంచి టెట్ పరీక్షలు: డీఈవో

image

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లును చేసిందని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఈ నెల 10 తేదీ నుంచి 21 వరకు జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలులో 3, ఆదోని,ఎమ్మిగనూరులో 1 చొప్పున ఏర్పాటు చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 39,485 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు.

News December 7, 2025

సీఐటీయూ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా నాయకులు

image

మెదక్‌లో జరుగుతున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలో పెద్దపల్లి జిల్లా నాయకులు ఈ రోజు బయలుదేరి వెళ్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఏ.ముత్యం రావు, తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను రూపకల్పన చేస్తారని తెలిపారు.

News December 7, 2025

గోపా పెద్దపల్లి జిల్లా నూతన కమిటీ ఎన్నిక

image

గౌడ అఫీషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ పెద్దపల్లి జిల్లా సర్వసభ్య సమావేశం జ్యోతినగర్‌ ఏరియాలో ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా మండ రమేష్‌, ప్రధాన కార్యదర్శిగా బందారపు యాదగిరి, కోశాధికారిగా కొక్కిస దేవేందర్‌, ఉపాధ్యక్షులు వీరగోని శ్రీనివాస్‌, అడ్డగుంట రాజేందర్‌, బాలసాని స్వామి, మేడగోని రాజమౌళితోపాటు పలువురిని ఎన్నుకున్నారు.