News August 14, 2025
అధికారులు సమన్వయంతో పని చేయాలి: మంత్రి ఉత్తమ్

భారీ వర్షాల నేపథ్యంలో హుజూర్ నగర్ ఎమ్మెల్యే,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల తో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలసత్వం వద్దని హెచ్చరించారు. ప్రాజెక్టుల వద్ద 24 గంటలు పహారా పెట్టాలని ఆదేశించారు. సిబ్బంది 72 గంటలు ఆయా కేంద్రాలలో ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.
Similar News
News March 13, 2026
గుంటూరు: రేపు జాతీయ లోక్ అదాలత్

జాతీయ లోక్ అదాలత్‌ను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. 14న ఉదయం 10 గంటల నుంచి జిల్లా న్యాయస్థానం ఆవరణలో లోక్ అదాలత్ జరుగుతుందన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, కాంపౌండబుల్, క్రిమినల్ కేసులు, కుటుంబ, వివాహ సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.
News March 13, 2026
గ్యాస్ సరఫరాపై అపోహలు వద్దు: కలెక్టర్

గ్యాస్ సిలిండర్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గృహ వినియోగదారులతో పాటు ఆసుపత్రులు, విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలకు, ఆశ్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
News March 13, 2026
RR: సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయి: కలెక్టర్

రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, రంగారెడ్డి జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఇంతకు ముందు గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా గ్యాస్ సరఫరా ఉంటుందని, ఎలాంటి జాప్యం ఉండదన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని, గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదన్నారు.


