News September 3, 2024
అధికారులు సిద్ధంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్
జిల్లాలో బలహీనంగా ఉన్న చెరువులు, కాలువ కట్టలకు వెంటనే మరమ్మతులు చేసి భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యూటేషన్లు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు తదితర వాటిపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
Similar News
News September 21, 2024
‘ఇది మంచి ప్రభుత్వం’పై అవగాహన కల్పించండి: నెల్లూరు కమిషనర్
కలెక్టర్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో అధికారులంతా చురుగ్గా పాల్గొని, 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూర్యతేజ తెలియజేసారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంల్లో 26వ తేదీ వరకు ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు.
News September 20, 2024
28న నెల్లూరు జిల్లా విజయ డెయిరీ ఎన్నికలు
నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి(విజయ డెయిరీ) ఎన్నికలను ఈనెల 28న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 20న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 23న నామినేషన్ల స్వీకరణ, అదే రోజున పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీ గడువు. 28న ఓటింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లను లెక్కిస్తారు.
News September 20, 2024
NLR: రూ.2.16 కోట్లు కొట్టేసిన మేనేజర్..!
ఓ మేనేజర్ రూ.2.16 కోట్లు స్వాహా చేసిన ఘటన నాయుడుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. పండ్లూరు వద్ద వెయిట్ లెస్ బ్రిక్స్ పరిశ్రమలో మేనేజర్‌గా కాట్రగడ్డ సురేశ్ పనిచేస్తున్నారు. రెండేళ్లుగా నకిలీ బిల్లులు సృష్టించారు. ఇలా దాదాపు రూ.2.16 కోట్లు స్వాహా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మేనేజర్‌తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిపై నాయుడుపేట సీఐ బాబి చీటింగ్ కేసు నమోదు చేశారు.