News November 3, 2024
అధికారుల తీరుపట్ల మంత్రి ఆనం అసహనం
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ZP సమావేశంలో MPను సగౌరవంగా ఆహ్వానించకపోవడంతో అలిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు.
Similar News
News December 6, 2024
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: కలెక్టర్
జిల్లా పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పర్యాటక, దేవాదాయ, అటవీశాఖ పరిధిలోని దర్శనీయ ప్రదేశాల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్లో వికీపీడియాలో అప్లోడ్ చేయాలని సూచించారు.
News December 6, 2024
నెల్లూరు జిల్లాలో ‘పుష్ప-2’ అరుదైన రికార్డ్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్‌లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.
News December 6, 2024
పండగ వాతావరణంలో మెగా PTM ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగేలా ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.