News March 2, 2025

అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల మరణాలు: కాటసాని

image

ఆత్మకూరులో అధికారుల బాధ్యతారాహిత్యం వల్లే తాగునీటి కలుషితమై ముగ్గురు మృతి చెందారని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. 3 నెలలుగా కాలనీలో తాగునీటి కలుషితం జరుగుతోందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలన్నారు.

Similar News

News March 20, 2025

ఖమ్మం: జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్: అ.కలెక్టర్

image

ఖమ్మంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లోని మీ సేవ ద్వారా జర్నలిస్టులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. అప్లై తరువాత రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జర్నలిస్టులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 20, 2025

వికారాబాద్: పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు

image

వికారాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 2వ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,903మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారు. 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

News March 20, 2025

మంచిర్యాల: ఆ ఉపాధ్యాయుడే కీచకుడు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. మంచిర్యాల గర్ల్స్ హై స్కూల్‌లో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

error: Content is protected !!