News December 1, 2025
అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో బాపట్ల రైతులు..!

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్‌లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.
Similar News
News February 18, 2026
‘అన్నా.. ప్లీజ్ వదిలేయ్ అన్నా’

అంటూ ఆ చిట్టితల్లి ఎంత ప్రాధేయపడి ఉంటుంది! ఆ మానవమృగ వికృతక్రీడలో ఎంత నరకం అనుభవించి ఉంటుంది? ఏపీలోని మదనపల్లెలో కులవర్ధన్ ఏడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన <<19172410>>ఘటన<<>> తీవ్రంగా కలచివేస్తోంది. ఇంటి ముందే ఉండే అతడిని నిత్యం ఆప్యాయంగా ‘అన్నా.. అన్నా’ అని పిలిచినా ఆ దుర్మార్గుడు కనికరించలేదు. అత్యంత క్రూరంగా బాలికను నీటి డ్రమ్ములో కుక్కేశాడు. విధి ఆడిన వింత నాటకంలో అతడు కూడా నీటిలోనే శవమై తేలాడు.
News February 18, 2026
ఈ అలవాట్లతో బరువు తగ్గొచ్చు

కండరాల నిర్మాణం, బలం కోసం ప్రోటీన్ ఉన్న ఆహారం తినాలి. ముఖ్యంగా చికెన్, సీ ఫుడ్, ఎగ్స్, సోయా, నట్స్, సీడ్స్ వంటి లీన్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. మటన్ వంటి మాంసాహారం తగ్గించాలి. దీంతో బరువు అదుపులో ఉంటుంది. క్యారెట్లు, ముల్లంగి, బీట్రూట్, మెంతికూర, పాలకూర ఎక్కువగా తింటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్, తగినంత నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 18, 2026
జగిత్యాల: ఉరి వేసుకొని మైనర్ బాలిక ఆత్మహత్య

పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక మంగళవారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక అనారోగ్యంతో బాధపడుతూ 15 రోజుల క్రితం ఇంటికి వచ్చింది. ఆసుపత్రిలో చికిత్స అందించగా, వ్యాధి న్యాయం కాకపోవడంతో నొప్పి భరించలేక బాలిక ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.


