News November 7, 2025

అధికారుల శాఖల వారిగా సమాచారాన్ని అందించాలి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ కారణంగా ప్రజలకు, రైతులకు కలిగిన నష్టం గురించి శాఖల వారీగా అధికారులు నివేదికలు సమర్పించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన ఈనెల 8వ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించనున్న సమీక్ష కమిటీ సమావేశం నిర్వహణపై శుక్రవారం ఆయన అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి వారి శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో ఈ సమావేశానికి హాజరు కావాలన్నారు

Similar News

News January 16, 2026

అల్లూరి: రూ.3 వేలు పలికిన ‘కోస’

image

కనుమ పండుగ రోజున జిల్లాలో కోడి పుంజు కోసకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. పందెంలో ఓడిపోయిన కోడి (కోస) కోసం జనాలు ఎగబడ్డారు. జీడీపప్పు, బాదం, పిస్తాల మేతతో పెంచిన ఈ కోడి రుచే వేరని అంటున్నారు. 2 కిలోల కోడి రూ.3వేలు వరకు పలుకుతుందని పలువురు అంటున్నారు. గత ఏడాది రూ.1500 ఉండేదని తెలిపారు.

News January 16, 2026

SUPER.. నిజామాబాద్‌కి FIRST RANK

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మన నిజామాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. 6.93 లక్షల మెట్రిక్ ​టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్‌ తొలి స్థానంలో నిలవగా 5.23 లక్షల MTల ధాన్యం సేకరణతో నల్గొండ సెకండ్ ప్లేస్ దక్కించుకుంది. కాగా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు పౌరసరఫరాల శాఖ 7రోజుల్లోనే డబ్బును ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్మలేదు.

News January 16, 2026

కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ అభివృద్ధి కాలేదు: సీఎం

image

TG: బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావాల్సినంత అభివృద్ధి జరగలేదు. కేసీఆర్ అనుకుంటే పదేళ్ల పాలనలో అభివృద్ధి చెంది ఉండేది. పాలమూరు జిల్లాతో పాటు సమానంగా నిధులు ఇస్తా. నిర్మల్‌కు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, కొత్త స్టేడియం మంజూరు చేస్తాం’ అని నిర్మల్ సభలో ప్రకటించారు.