News September 12, 2025
అనంతగిరి: గల్లెంతైన గిరిజనుడు ఆచూకీ లభ్యం

అనంతగిరి మండలంలో గురువారం ఓ గిరిజనుడు ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు. గుమ్మా పంచాయతీ పరిధి గ్రామాల్లో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. ఈ క్రమంలో వంజలవలసకి చెందిన దేముడు, బంధువును చిట్టంవలసకి దిగబెట్టేందుకు ఇద్దరు కలిసి వెళ్లారు. వాగును దాటించే క్రమంలో బంధువు వెళ్లిపోగా దేముడు గల్లంతై ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమవగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్‌కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.
News December 7, 2025
SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.
News December 7, 2025
ALERT.. రేపటి నుంచి భారీగా పడిపోనున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రేపటి నుంచి వారం రోజుల పాటు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 18 జిల్లాల్లో 9-12డిగ్రీలు, 12 జిల్లాల్లో 6-9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని అంచనా వేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని తెలిపారు. పగటి వేళల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు.


