News January 27, 2025
అనంతగిరి: BRS పవర్‌లోకి రావడం ఖాయం: మాజీ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం అనంతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 11, 2025
ప్రభాస్ ముగ్గురు చెల్లెళ్లను చూశారా?

దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి, ముగ్గురు కూతుళ్లు(ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి) బంధువుల పెళ్లిలో దిగిన ఫొటో వైరలవుతోంది. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ క్రమంలో చెల్లెళ్లంతా కలిసి డార్లింగ్‌కు త్వరగా వివాహం జరిపించాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కొడుకే ప్రభాస్. ఇతనికి అన్న ప్రబోధ్(నిర్మాత), సోదరి ప్రగతి ఉన్నారు.
News February 11, 2025
అయిజ: గుండెపోటుతో RMP వైద్యుడు మృతి

అయిజ మండలంలో గుండెపోటుతో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెంకటాపురం స్టేజీలో కొన్నేళ్లుగా వెంకట్రాముడు అనే వ్యక్తి RMP వైద్యుడిగా పని చేస్తున్నాడు. కాగా నేడు సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. వైద్యుడి మృతితో పలు గ్రామాల ప్రజలు విచారణ వ్యక్తం చేశారు.
News February 11, 2025
శివరాత్రి సందర్భంగా అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈఓలతో సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈసారి చర్యలు చేపట్టాలన్నారు.