News September 17, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.35
➤ అనంతపురం పాతూరు మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా మేలు రకం రూ.35తో అమ్మకాలు జరిగాయి. కనిష్ఠంగా కిలో రూ.20 పలికాయి.
➤ నగరంలోని మార్కెట్ యార్డులో టన్ను చీనీ కాయలు గరిష్ఠంగా రూ.18వేల ప్రకారం విక్రయాలు జరిగాయి.
Similar News
News October 5, 2024
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన ఎనుములపల్లి విద్యార్థులు
అనంతపురంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన క్రీడా పోటీల్లో పుట్టపర్తి మున్సిపల్ పరిధి ఎనుములపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బాల్ బ్యాడ్మింటన్ అండర్-14, 17 విభాగాల్లో గౌతమి, కౌశిక్ రెడ్డి, విజయ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ రమేశ్ బాబు తెలిపారు. వీరు పశ్చిమగోదావరి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News October 5, 2024
‘ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి.. ఆదర్శ గురువులుగా మారి’
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుదర్శన రావు, శశిధర్ అనేక మంది విద్యార్థులను ఇంజినీర్లుగా మార్చారు. గతంలో వారి ప్రభుత్వ ఇంజినీర్ ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి ప్రొఫెసర్లుగా బోధన మార్గాన్నే ఎంచుకొని ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాలలో ఇంజినీర్లుగా, పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో JE, AE, AEEలుగా తీర్చదిద్దారు.
News October 5, 2024
అనంత: దసరా సెలవులలో ఊళ్లకు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
అనంతపురం: దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు చోరీలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ సీఐ ఇస్మాయిల్ పేర్కొన్నారు. దొంగతనాలు జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ప్రజలు సహకరించి సీసీఎస్ పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు, బంగారం దొంగల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.