News December 27, 2024

అనంతపురం జిల్లాతో మన్మోహన్ సింగ్‌కు అనుబంధం 

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనంతపురం జిల్లాతో అనుబంధం ఉంది. 2006లో నార్పల మండలంలోని బండ్లపల్లి నుంచే దేశంలోనే తొలిసారిగా ఉపాధి హామీ పథకాన్ని అప్పటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రారంభించారు. ఆ పథకం ప్రారంభించిన పదేళ్ల తర్వాత 2016లో ఆయన రాహుల్ గాంధీతో కలిసి జిల్లాకు వచ్చారు. అప్పటి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బండ్లపల్లిలో ప్రజలతో మమేకమై ఉపాధిహామీ సమస్యలను తెలుసుకున్నారు.

Similar News

News January 20, 2025

అనంతపురం: ఏకసభ్య కమిషన్‌ను కలిసిన కలెక్టర్‌లు

image

ఎస్సీల ఉప వర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రాను రెండు జిల్లాల కలెక్టర్లు కలిశారు. సోమవారం అనంతపురం పట్టణంలోని R&B అతిథి గృహంలో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న తదితరులు కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.

News January 20, 2025

మైనస్ 8 డిగ్రీల చలిలో తాడిపత్రి చిన్నారుల నృత్యం

image

తాడిపత్రికి చెందిన చిన్నారులు జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి టెంపుల్, హిడింబ వద్ద మైనస్ 8 డిగ్రీల చలిలో కూచిపూడి నృత్యం చేసి అందరిని అబ్బురపరిచారు. దాదాపు 22 కిలోమీటర్లు కాలినడకన చేరుకుని నృత్య ప్రదర్శన చేసినట్లు శిక్షకులు వందన, ప్రవీణ్ లు తెలిపారు. ఈ చిన్నారులు ఇప్పటికే వరల్డ్ రికార్డ్ బుక్‌లో చోటు సంపాదించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత అభినందనలు అందుకున్నారు.

News January 20, 2025

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడిపై పోక్సో కేసు

image

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. సీఐ మహానంది వివరాల మేరకు.. పట్టణానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ప్రేమ పేరుతో ఓ బాలికను వేధిస్తున్నాడు. హెచ్చరించినా అతడి తీరు మారలేదు. తరచూ వేధింపులకు గురిచేస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.