News April 1, 2024

అనంతపురం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం

image

అనంతపురం జిల్లాలో భారీ మొత్తంలో నగదును ఆదివారం పోలీసులు సీజ్ చేశారు. తాడిపత్రి పరిధిలోని బస్ స్టాండ్ వద్ద షేక్ మస్తాన్ హాజీవలి అనే ధనియాల వ్యాపారి వద్ద దాదాపు రూ.1.31 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అధికారులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని షేక్ మస్తాన్ హాజీవలిని విచారిస్తున్నారు. నగదుకు సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారు. ఇవాళ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 17, 2026

ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసిన కలెక్టర్

image

బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులోని అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో కలెక్టర్ ఆనంద్ జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు నమిలి మింగాలని సూచించారు. సంవత్సరంలో రెండు సార్లు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల నులిపురుగులు నశిస్తాయని తెలిపారు. పలువురు విద్యార్థులు ఇక్కడికి చేరుకొని మాత్రలు స్వీకరించారు.

News February 17, 2026

చెస్ పోటీలు ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ

image

అనంతపురంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో శాప్ లీగ్–2026 చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, కలెక్టర్ ఆనంద్ హాజరై వీటిని ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. జిల్లా నుంచి ప్రతిభావంతులు వెలుగులోకి రావాలన్నారు. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఇక్కడికి చేరుకొని ఉత్సాహంగా పాల్గొన్నారు.

News February 17, 2026

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి సమన్వయంతో చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. శిల్పారామం, గుత్తి కోట ఉత్సవాలు, బోటింగ్, హెరిటేజ్ వాక్ కార్యక్రమాలను నాణ్యతగా అమలు చేసి పర్యాటకులను ఆకర్షించాలని తెలిపారు.